Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 139 Old No: 89

మనకై యేసు మరణించె

Manakai Yesu Maranince

Open in Word & Worship App
తెలుగు   మనకై యేసు మరణించె
పల్లవి
మనకై యేసు మరణించె మనపాపముల కొరకే
నిత్యజీవము నిచ్చుటకే సత్యుండు సజీవుడాయెన్‌
1)
తృణీకరింపబడి - విసర్జింపబడెను
దుఃఖా క్రాంతుడాయెన్‌ వ్యసనముల భరించెను
|| మన ||
2)
మన వ్యసనముల వహించెన్‌ - మన దుఃఖముల భరించెన్‌
మనమెన్నిక చేయకయే - మన ముఖముల త్రిప్పితిమి
|| మన ||
3)
మన యతిక్రమముల కొరకు - మన దోషముల కొరకు
మన నాధుడు శిక్షనొందెన్‌ - మనకు స్వస్థత కలిగెన్‌
|| మన ||
4)
గొఱ్ఱెలవలె తప్పితిమి - పరుగిడితిమి మన దారిన్‌
అరుదెంచె కాపరియై - అర్పించె ప్రాణమును
|| మన ||
5)
దౌర్జన్యము నొందెను - బాధింపబడెను
తననోరు తెరువలేదు - మనకైక్రయధనమియ్యన్‌
|| మన ||
6)
ఎదిరింపలేదెవరిన్‌ - లేదే కపటము నోటన్‌
యెహోవ నలుగ గొట్టెన్‌ - మహావ్యాధిని కలిగించెన్‌
|| మన ||
7)
సిలువలో వ్రేలాడెన్‌ - సమాధిలో నుండెన్‌
సజీవుండై లేచెన్‌ - స్తోత్రము హల్లెలూయ
|| మన ||
English   Manakai Yesu Maranince
Chorus
Manakai Yesu Maraninche Manapaapamula Korake
Nityajeevamu Nichchutake Satyundu Sajeevudaayen
1)
Truneekarinpabadi - Visarjinpabadenu
DuHkhaa Kraantudaayen Vyasanamula Bharinchenu
|| Mana ||
2)
Mana Vyasanamula Vahinchen - Mana DuHkhamula Bharinchen
Manamennika Cheyakaye - Mana Mukhamula Trippitimi
|| Mana ||
3)
Mana Yatikramamula Koraku - Mana Doshamula Koraku
Mana Naadhudu Sikshanonden - Manaku Svasthata Kaligen
|| Mana ||
4)
Gorrelavale Tappitimi - Parugiditimi Mana Daarin
Arudenche Kaapariyai - Arpinche Praanamunu
|| Mana ||
5)
Daurjanyamu Nondenu - Baadhinpabadenu
Tananoru Teruvaledu - Manakaikrayadhanamiyyan
|| Mana ||
6)
Edirinpaledevarin - Lede Kapatamu Notan
Yehova Naluga Gotten - Mahaavyaadhini Kaliginchen
|| Mana ||
7)
Siluvalo Vrelaaden - Samaadhilo Nunden
Sajeevundai Lechen - Stotramu Hallelooya
|| Mana ||
Present