తెలుగు బలియైతివా నాకొరకై యేసు
పల్లవిబలియైతివా నా కొరకై యేసు కలువరిపై - లోక కలుషము హరియింప
1)ఉమ్మి వేసిన గాని - ఊరకుంటివా ప్రభువా
నమ్మిన వేళ - నా ఉమ్మిలేదని చూప
|| బలి ||
2)అరచేతులతో నిన్ను - చరచి కొట్టిన వేళ
మారుమాటాడవు అది - నా కొరత శిక్షని తెలుప
|| బలి ||
3)కాలుచేతులు గట్టి - కయప యింటికి నీడ్వ
తూల నాడవ దేవా - ఈలాటి నను బ్రోవ
|| బలి ||
4)ముసుకు వైచియు గ్రుద్ది - ముందుకు నెట్టిన
విసుగు పడవేమి - నా విధి తీర్చితివి రాజా
|| బలి ||
5)తలపై ముండ్లకిరీట - మలసిన దిగగొట్టి
సిలువపై బిగియింప - మలమల కాలుచు నెండలో
|| బలి ||
6)ముద్దయివై సిలువ మొద్దుపై నిలుపగ
ప్రొద్దు గ్రుంకెనా పరి-శుద్ధుడవని తెలుప
|| బలి ||
English Baliyaitiva Naakorkai Yesu
ChorusBaliyaitivaa Naa Korakai Yesu Kaluvaripai - Loka Kalushamu Hariyinpa
1)Ummi Vesina Gaani - Oorakuntivaa Prabhuvaa
Nammina Vela - Naa Ummiledani Choopa
|| Bali ||
2)Arachetulato Ninnu - Charachi Kottina Vela
Maarumaataadavu Adi - Naa Korata Sikshani Telupa
|| Bali ||
3)Kaaluchetulu Gatti - Kayapa Yintiki Needva
Toola Naadava Devaa - Eelaati Nanu Brova
|| Bali ||
4)Musuku Vaichiyu Gruddi - Munduku Nettina
Visugu Padavemi - Naa Vidhi Teerchitivi Raajaa
|| Bali ||
5)Talapai Mundlakireeta - Malasina Digagotti
Siluvapai Bigiyinpa - Malamala Kaaluchu Nendalo
|| Bali ||
6)Muddayivai Siluva Moddupai Nilupaga
Proddu Grunkenaa Pari-Suddhudavani Telupa
|| Bali ||