తెలుగు పాపికి రక్షణ నొసగిన
పల్లవిపాపికి రక్షణ నొసగిన పతిత పావనుడా స్తుతింతున్
ఘన యేసుదేవ స్తుతింతున్ (2)
1)పాపులగావను పరమతండ్రి నిను లోకంబున కంపెనుగా
పాపులకొరకై ప్రాణము పెట్టను - సంకల్పించుకొన్నావా - (2)
|| పాపి ||
2)లోకపాపము మోసెడి దేవుని గొఱ్ఱెపిల్లవైనావా
మోయలేని యా పాపభారమును - వీపున మోసితివయ్యా- (2)
|| పాపి ||
3)మేలు చేసిన కాలు సేతులలో చీలలు గొట్టిర తండ్రి
ముండ్లతోడ నొక మకుటమల్లి నీ శిరమున గొట్టిర యూదుల్-(2)
|| పాపి ||
4)నీదు రాజ్యములో నెనరున నను దయ చేర్చుమని ప్రార్థింపన్
నేడిదె పరదైసులో నుండెదవని - ప్రేమతో బల్కితివయ్యా- (2)
|| పాపి ||
5)నీతి సూర్యుడా నిర్మలయశుడ నిజముగ ఇమ్మానుయేలు
దేవుడ - నిందకు హృదయము బ్రద్దలాయెనా - నీరుగ
పోయబడితివా- (2)
|| పాపి ||
6)వధకు తేబడు గొఱ్ఱెపిల్లగా సిలువలో వ్రాలితివయ్యా
నాలుక దౌడను - అంటుకున్నదా - మైనమువలె కరిగితివా- (2)
|| పాపి ||
7)నా దేవ నాదేవ నన్నిటుచేయి విడిచితివ యనుచు
ఎముకలు స్థానము తప్పుచుండగా-సిలువలో నలిగితివయ్యా- (2)
|| పాపి ||
8)ఎంతటి ప్రేమ ఎంతటి శాంత మెటుల వర్ణింతును - దేవా
పావన చరిత పరమ దయాళూ - వందనమిదె గైకొనుమా- (2)
|| పాపి ||
English Paapiki Rakshana Nosagina
ChorusPaapiki Rakshana Nosagina Patita Paavanudaa Sthuthintun
Ghana Yesudeva Sthuthintun (2)
1)Paapulagaavanu Paramatandri Ninu Lokanbuna Kanpenugaa
Paapulakorakai Praanamu Pettanu - Sankalpinchukonnaavaa - (2)
|| Paapi ||
2)Lokapaapamu Mosedi Devuni Gorrepillavainaavaa
Moyaleni Yaa Paapabhaaramunu - Veepuna Mositivayyaa- (2)
|| Paapi ||
3)Melu Chesina Kaalu Setulalo Cheelalu Gottira Tandri
Mundlatoda Noka Makutamalli Nee Siramuna Gottira Yoodul-(2)
|| Paapi ||
4)Needu Raajyamulo Nenaruna Nanu Daya Cherchumani Praarthinpan
Nedide Paradaisulo Nundedavani - Premato Balkitivayyaa- (2)
|| Paapi ||
5)Neeti Sooryudaa Nirmalayasuda Nijamuga Immaanuyelu
Devuda - Nindaku Hrudayamu Braddalaayenaa - Neeruga
Poyabaditivaa- (2)
|| Paapi ||
6)Vadhaku Tebadu Gorrepillagaa Siluvalo Vraalitivayyaa
Naaluka Daudanu - Antukunnadaa - Mainamuvale Karigitivaa- (2)
|| Paapi ||
7)Naa Deva Naadeva Nannitucheyi Vidichitiva Yanuchu
Emukalu Sthaanamu Tappuchundagaa-Siluvalo Naligitivayyaa- (2)
|| Paapi ||
8)Entati Prema Entati Saanta Metula Varnintunu - Devaa
Paavana Charita Parama Dayaaloo - Vandanamide Gaikonumaa- (2)
|| Paapi ||