తెలుగు దైవతనయా క్రీస్తునాధుండా
పల్లవిదైవ తనయా క్రీస్తునాథుండా అయ్యా పాపులకై
ప్రాణమిచ్చితివా దేవుడే నిను పంపినాడా
1)ప్రేమతోడ పరము విడిచి - పాట్లుపడితివా పాపికొరకై ప్రాణమిచ్చి
రక్షించితివా అయ్యా ఘోర మరణంబనుభవించితివా
|| దైవ ||
2)కల్వరిపై కాలు సేతులు క్రూరముగ బంధించి వైరులు - నేర
మును నీ పైన మోపిరా అట్టి నేరమెన్నడు చేయవైతివిగా
|| దైవ ||
3)ఇన్ని బాధలు అనుభవించుచు కన్న తల్లిని చూచి ఎంతో
కరుణతోడ- యోహానుకు - నాడు అప్పగించిన ప్రేమ తనయుండా
|| దైవ ||
4)చివరిఘడియలో సిలువపైని - తులువలు నిను తిట్టి పోసియు
మనసు మారి ఒకడు పిలువగ - వాని కరుణతో పరదైసు చేర్చితివా
|| దైవ ||
5)చిట్టచివరిలో శిరమువంచి - ఆత్మను తండ్రి కర్పించి సమాప్త
మాయెనని పలికితివా అయ్యా పాపికి రక్షణ దెచ్చితివా
|| దైవ ||
6)తిరిగివచ్చి పరముజేర్చి - వరములిచ్చు దివ్యమూర్తి వర్ణింప
నెవరి తరమయ్యా అయ్యా దయార్థమైన నీదు హృదయము
|| దైవ ||
7)వేయి యేండ్లు వసుధపై - సింహాసనంబలంకరించి రారాజువై
ఈ లోక మేలెదవా క్రీస్తు బాధలే యెరుగముగ అచ్చట
|| దైవ ||
English Daivathanaaya Kreestunaadhundaa
ChorusDaiva Tanayaa Kreestunaathundaa Ayyaa Paapulakai
Praanamichchitivaa Devude Ninu Panpinaadaa
1)Prematoda Paramu Vidichi - Paatlupaditivaa Paapikorakai Praanamichchi
Rakshinchitivaa Ayyaa Ghora Marananbanubhavinchitivaa
|| Daiva ||
2)Kalvaripai Kaalu Setulu Krooramuga Bandhinchi Vairulu - Nera
Munu Nee Paina Mopiraa Atti Neramennadu Cheyavaitivigaa
|| Daiva ||
3)Inni Baadhalu Anubhavinchuchu Kanna Tallini Choochi Ento
Karunatoda- Yohaanuku - Naadu Appaginchina Prema Tanayundaa
|| Daiva ||
4)Chivarighadiyalo Siluvapaini - Tuluvalu Ninu Titti Posiyu
Manasu Maari Okadu Piluvaga - Vaani Karunato Paradaisu Cherchitivaa
|| Daiva ||
5)Chittachivarilo Siramuvanchi - Aatmanu Tandri Karpinchi Samaapta
Maayenani Palikitivaa Ayyaa Paapiki Rakshana Dechchitivaa
|| Daiva ||
6)Tirigivachchi Paramujerchi - Varamulichchu Divyamoorti Varninpa
Nevari Taramayyaa Ayyaa Dayaarthamaina Needu Hrudayamu
|| Daiva ||
7)Veyi Yendlu Vasudhapai - Sinhaasananbalankarinchi Raaraajuvai
Ee Loka Meledavaa Kreestu Baadhale Yerugamuga Achchata
|| Daiva ||