తెలుగు సిలువ భారము భరించలేని
పల్లవిసిలువ భారము భరించలేని భారమైనా మోసితివి ప్రభు
పలుమార్లు ఒరిగిలేచి గిరికి సాగితివి ప్రభు
1)దుర్భాషలెల్ల పలుకుచుండ మౌనివైతివా కొరడాలు నీదు
దేహమంత చీల్చి వేయగా - ప్రవహించె నీదు మధుర ప్రేమ
రుధిరధారలై
|| సిలువ ||
2)సిలువేయు మనుచు రాత్రి జాములో కేకలేసిరా - అన్యాయమైన
తీర్పు తీర్చి సిలువకేసిరా - కఠినాత్ములైన వారికేకలే కడకు గెల్చెనా
|| సిలువ ||
3)కనుపండుగాయె కఠినులకు నీ బాధ చూడగా
స్థంభించిపోయె దూత గణము తొంగిచూడగా
పరలోక తండ్రికి ఇదంత మోదమాయెనా
|| సిలువ ||
4)మా పాప భారమంతా నీపై మోపబడినదా మా శాపఋణము
లన్ని నీవు తీర్చితివి కదా - నీ ఋణము మేము ఇలలో
ఎటుల తీర్చెదము ప్రభు గైకొనుము మమ్ము ప్రభు
|| సిలువ ||
English Siluva Bhaaramu Bharincaleni
ChorusSiluva Bhaaramu Bharinchaleni Bhaaramainaa Mositivi Prabhu
Palumaarlu Origilechi Giriki Saagitivi Prabhu
1)Durbhaashalella Palukuchunda Maunivaitivaa Koradaalu Needu
Dehamanta Cheelchi Veyagaa - Pravahinche Needu Madhura Prema
Rudhiradhaaralai
|| Siluva ||
2)Siluveyu Manuchu Raatri Jaamulo Kekalesiraa - Anyaayamaina
Teerpu Teerchi Siluvakesiraa - Kathinaatmulaina Vaarikekale Kadaku
Gelchenaa
|| Siluva ||
3)Kanupandugaaye Kathinulaku Nee Baadha Choodagaa
Sthanbhinchipoye Doota Ganamu Tongichoodagaa
Paraloka Tandriki Idanta Modamaayenaa
|| Siluva ||
4)Maa Paapa Bhaaramantaa Neepai Mopabadinadaa Maa Saaparnamu
Lanni Neevu Teerchitivi Kadaa - Nee Runamu Memu Ilalo
Etula Teerchedamu Prabhu Gaikonumu Mammu Prabhu
|| Siluva ||