Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 13 Old No: 20

పావనుడా మా ప్రభువా

Paavanudaa Maa Prabhuvaa

♪ సీయోను గీతములు♪ Songs of Zion
Open in Word & Worship App
తెలుగు   పావనుడా మా ప్రభువా
పల్లవి
పావనుడా మా ప్రభువా - నీ రక్షణకై స్తోత్రములు
నీ రక్షణకై స్తోత్రములు
1)
అత్యున్నతమైన దేవా - సింహాసనాసీనుడవు
ఎంతో గొప్పది నీ మహిమ - వర్ణింపజాలను నేను
|| పాప ||
2)
పాపపు కుష్ఠుతో పడి చెడిన - యీ పాపిని కరుణించితివి
నా పాపపుడాగులు కడిగి పరిశుద్ధుని చేసిన విభుడా
|| పాప ||
3)
అపవిత్రమగు పెదవులతో - కపటముగా జీవించితిని
అపరాధినోటిని తెరచి - స్తుతిగీతము నొసగిన ప్రభువా
|| పాప ||
4)
నీ క్రయధనమధికము ఎంతో - నా కర్త, నిను ప్రణుతింతు
నా కందరికంటే ఘనుడా! ఓ కల్వరినాథా, యేసూ
|| పాప ||
5)
మహిమపరతును ప్రభుయేసు - మహదానందముతో నిరతం
మహోన్నతుడా ప్రభు నిన్ను - మహిమలో ఆరాధించెదను
|| పాప ||
6)
నా కనులతో నిను చూచెదను - ఆకసమున దూతల మధ్య
రక్షక త్వరగా రారమ్ము - అక్షయుడా నీకే స్తుతులు
|| పాప ||
English   Paavanudaa Maa Prabhuvaa
Chorus
Paavanudaa Maa Prabhuvaa - Nee Rakshanakai Stotramulu
Nee Rakshanakai Stotramulu
1)
Atyunnatamaina Devaa - Sinhaasanaaseenudavu
Ento Goppadi Nee Mahima - Varninpajaalanu Nenu
|| Paapa ||
2)
Paapapu Kushthuto Padi Chedina - Yee Paapini Karuninchitivi
Naa Paapapudaagulu Kadigi Parisuddhuni Chesina Vibhudaa
|| Paapa ||
3)
Apavitramagu Pedavulato - Kapatamugaa Jeevinchitini
Aparaadhinotini Terachi - Sthuthigeetamu Nosagina Prabhuvaa
|| Paapa ||
4)
Nee Krayadhanamadhikamu Ento - Naa Karta, Ninu Pranutintu
Naa Kandarikante Ghanudaa! O Kalvarinaathaa, Yesoo
|| Paapa ||
5)
Mahimaparatunu Prabhuyesu - Mahadaanandamuto Niratam
Mahonnatudaa Prabhu Ninnu - Mahimalo Aaraadhinchedanu
|| Paapa ||
6)
Naa Kanulato Ninu Choochedanu - Aakasamuna Dootala Madhya
Rakshaka Tvaragaa Raarammu - Akshayudaa Neeke Stutulu
|| Paapa ||
Present