తెలుగు గాయములన్ గాయములన్
పల్లవిగాయములన్ గాయములన్ - మన కొరకై పొందెను క్రీస్తు ప్రభు
1)సురూపమైన సొగసైనలేదు - దుఃఖభరితుండాయెను
వ్యాధిగ్రస్తుడుగ వ్యాకుల మొందెను - వీక్షించి త్రిప్పిరి ముఖముల్
|| గాయ ||
2)మన రోగములను మన దుఃఖములను - మనకైతానే
భరియించె మొత్తబడెను బాధింపబడెను - ఎంతో శ్రమనొందెమనకై
|| గాయ ||
3)మన యతిక్రమ క్రియలను బట్టి - మరి నలుగగొట్టబడెను
తాను పొందిన దెబ్బల ద్వారా - స్వస్థత కలిగె మనకు
|| గాయ ||
4)పాపంబు కపటంబులేదు ప్రభునందు - మౌనము వహియించె
మనకై ప్రాణంబు మనకై ప్రియముగ నర్పించె
ప్రభువే ఘోరసిలువపై
|| గాయ ||
5)క్రీస్తుప్రేమను మరువజాలము - ఎంతో ప్రేమించె మనల
సిలువపై మనము గమనించ మనకు - విలువవైన విడుదల కలిగె
|| గాయ ||
English Gaayamulan Gaayamulan
ChorusGaayamulan Gaayamulan - Mana Korakai Pondenu Kreestu Prabhu
1)Suroopamaina Sogasainaledu - DuHkhabharitundaayenu
Vyaadhigrastuduga Vyaakula Mondenu - Veekshinchi Trippiri Mukhamul
|| Gaaya ||
2)Mana Rogamulanu Mana DuHkhamulanu - Manakaitaane
Bhariyinche Mottabadenu Baadhinpabadenu - Ento Sramanondemanakai
|| Gaaya ||
3)Mana Yatikrama Kriyalanu Batti - Mari Nalugagottabadenu
Taanu Pondina Debbala Dvaaraa - Svasthata Kalige Manaku
|| Gaaya ||
4)Paapanbu Kapatanbuledu Prabhunandu - Maunamu Vahiyinche
Manakai Praananbu Manakai Priyamuga Narpinche
Prabhuve Ghorasiluvapai
|| Gaaya ||
5)Kreestupremanu Maruvajaalamu - Ento Preminche Manala
Siluvapai Manamu Gamanincha Manaku - Viluvavaina Vidudala Kalige
|| Gaaya ||