Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 125 Old No: 75

ఏ పాపమెరుగని యోపావన

E Paapamerugani Yoopavana

Open in Word & Worship App
తెలుగు   ఏ పాపమెరుగని యోపావన
పల్లవి
ఏ పాప మెరుగని - యోపావన మూర్తి - పాప విమోచకుండ
నా పాలి దైవమా - నా పాపముల కొఱ - కీపాట్లు నొందినావా
1)
ముళ్ళతో గిరీట - మల్లి నీ శిరము పై - జల్లాటమున మొత్తిరా
ముళ్ళపోట్లకు శిరము - తల్లడిల్లగ సొమ్మసిల్లి పోతివ రక్షకా
|| ఏ పాప ||
2)
కలువరి గిరి దనుక - సిలువ మోయలేక కలవరము నొందినావా
సిలువ నీతో మోయ - తులువలు వేరొకని దోడుగా నిచ్చినారా
|| ఏ పాప ||
3)
చెడుగు యూదులు బెట్టు - పడరాని పాట్లకు సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి - కడకేగి సిల్వను గ్రక్కున దించినావా
|| ఏ పాప ||
4)
ఆ కాలకర్ములు - భీకరంబుగ నిన్ను - ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు ఆ కొయ్యకే సూది - మేకులతో గ్రుచ్చినారా
|| ఏ పాప ||
5)
పలువిధంబుల శ్రమలు - చెలరేగ తండ్రికి ఎలుగెత్తి మొర
లిడితివా - సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ
వలన దాహమునాయెనా
|| ఏ పాప ||
6)
బల్లిదుండగు బంటుబల్లెమున నీ ప్రక్క జిల్లిబడ బొడిచినాడా
ఉల్లోలములవలె - నల్ల నీరుబుకంగ జల్లారెగద కోపము
|| ఏ పాప ||
7)
కటకటా పాప - సంకటము బాపుటకింత పటుబాధ నొందినావా
యెటువంటి దీ ప్రేమ - ఎటువంటి దీ శాంత మెటుల వర్ణింతు స్వామి
|| ఏ పాప ||
English   E Paapamerugani Yoopavana
Chorus
e Paapa Merugani - Yopaavana Moorti - Paapa Vimochakunda
Naa Paali Daivamaa - Naa Paapamula Kora - Keepaatlu Nondinaavaa
1)
Mullato Gireeta - Malli Nee Siramu Pai - Jallaatamuna Mottiraa
Mullapotlaku Siramu - Talladillaga Sommasilli Potiva Rakshakaa
|| e Paapa ||
2)
Kaluvari Giri Danuka - Siluva Moyaleka Kalavaramu Nondinaavaa
Siluva Neeto Moya - Tuluvalu Verokani Dodugaa Nichchinaaraa
|| e Paapa ||
3)
Chedugu Yoodulu Bettu - Padaraani Paatlaku Sudivadi Nadachinaavaa
Kadaku Kalvari Giri - Kadakegi Silvanu Grakkuna Dinchinaavaa
|| e Paapa ||
4)
Aa Kaalakarmulu - Bheekaranbuga Ninnu - Aa Koyyapai Nunchiraa
Nee Kaalu Setulu Aa Koyyake Soodi - Mekulato Gruchchinaaraa
|| e Paapa ||
5)
Paluvidhanbula Sramalu - Chelarega Tandriki Elugetti Mora
Liditivaa - Siluvapai Palumaaru Kaluguchundedi Baadha
Valana Daahamunaayenaa
|| e Paapa ||
6)
Ballidundagu Bantuballemuna Nee Prakka Jillibada Bodichinaadaa
Ullolamulavale - Nalla Neerubukanga Jallaaregada Kopamu
|| e Paapa ||
7)
Katakataa Paapa - Sankatamu Baaputakinta Patubaadha Nondinaavaa
Etuvanti Dee Prema - Etuvanti Dee Saanta Metula Varnintu Svaami
|| e Paapa ||
Present