Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 124 Old No: 74

ఎంతో వింత యెంతో చింత

Ento Vinta Yento Chinta

Open in Word & Worship App
తెలుగు   ఎంతో వింత యెంతో చింత
పల్లవి
ఎంతో వింత - యెంతో చింత - యేసునాథు మరణమంత
పంతముతో జేసిరంత - సొంత ప్రజలు స్వామినంత
1)
పట్టికట్టి నెట్టికొట్టి - తిట్టిరేసు నాథునకటా - అట్టి శ్రమల
నొంది పలుక డాయె యేసు స్వామి నాడు
|| ఎంతో ||
2)
మొయ్యలేని మ్రానునొకటి - మోపి రేసు వీపుపైని
మొయ్యలేక మ్రానితోడ - మూర్చబోయె నేసుతండ్రి
|| ఎంతో ||
3)
కొయ్యపై నేసయ్యన్‌ బెట్టి - కాలు సేతులలో జీలల్‌
కఠినులంత గూడికొట్టిరి - ఘోరముగ క్రీస్తేసున్‌ బట్టి
|| ఎంతో ||
4)
దాహముగొన చేదు చిరక - ద్రావ నిడిరి ద్రోహులకటా
ధాత్రి ప్రజలబాధకోర్చి - ధన్యుడా దివికేగే న హ హా
|| ఎంతో ||
5)
బల్లెముతో బక్కన్‌ బొడవన్‌ - పారె నీరు రక్త మ హ హా
ఏరైపారె యేసు రక్త - మెల్ల ప్రజల కెలమి నొసగు
|| ఎంతో ||
English   Ento Vinta Yento Chinta
Chorus
Ento Vinta - Yento Chinta - Yesunaathu Maranamanta
Pantamuto Jesiranta - Sonta Prajalu Svaaminanta
1)
Pattikatti Nettikotti - Tittiresu Naathunakataa - Atti Sramala
Nondi Paluka Daaye Yesu Svaami Naadu
|| Ento ||
2)
Moyyaleni Mraanunokati - Mopi Resu Veepupaini
Moyyaleka Mraanitoda - Moorchaboye Nesutandri
|| Ento ||
3)
Koyyapai Nesayyan Betti - Kaalu Setulalo Jeelal
Kathinulanta Goodikottiri - Ghoramuga Kreestesun Batti
|| Ento ||
4)
Daahamugona Chedu Chiraka - Draava Nidiri Drohulakataa
Dhaatri Prajalabaadhakorchi - Dhanyudaa Divikege Na Ha Haa
|| Ento ||
5)
Ballemuto Bakkan Bodavan - Paare Neeru Rakta Ma Ha Haa
eraipaare Yesu Rakta - Mella Prajala Kelami Nosagu
|| Ento ||
Present