తెలుగు ఎంతో దుఃఖము బొందితివా
పల్లవిఎంతో దుఃఖము బొందితివా! నా కొరకెంతో - దుఃఖము
పొందితివా - ఎంతో దుఃఖము నీకు - ఎంతో చింతయు
నీకు - ఎంతో దిగులయ్యా నాకు - ఆ - పొంతిపిలాతు -
యూదులు నీకు బెట్టిన - శ్రమలను దలపోయగా
1)వచ్చిరి యూదులు - ముచ్చట లాడుచు నెచ్చట వాడనుచు
నిన్ను-మత్సరముతో వారి - యిచ్చవచ్చినట్లు కొట్టి దూషించినారా
|| ఎంతో ||
2)సుందరమగు దేహ - మందున దెబ్బలు - గ్రంథులు గట్టినవా!
నీవు పొందిన బాధ నా-డెందము తలంప నా-నందము లేదయెను
|| ఎంతో ||
3)కొట్టుకొట్టుమని - తిట్టి కేల్ దట్టి ని - న్నట్టిట్టు నెట్టుచును - వారు
పెట్టు శ్రమలు తుద - మట్టున కోర్చియు - బెట్టితివా ప్రాణము
|| ఎంతో ||
4)నెపముం బెట్టుచుం దిట్టి - యపహసించుచు యూద - చపలులు
గొట్టినారా - నా - యపరాధములకు నా - పదలను బొంది
నీ - కృప నాకు జూపినావా
|| ఎంతో ||
5)చక్కని నా యేసు ! మిక్కిలి బాధ నీ - కెక్కువ గలిగెనయ్య
ఆహా! యొక్క దుష్టుడీటె - ప్రక్కను గ్రుచ్చి - తన యక్కస
దీర్చుకొనెనా
|| ఎంతో ||
6)అన్నదమ్ములైన అక్క సెల్లెండ్రైన - కన్న పిత్రాదులైనా -
నన్ను ఎన్నడైనా బ్రేమించ లేరైరి - నాయన్న ప్రేమించినావా
|| ఎంతో ||
English Ento Dukhamu Bonditiva
ChorusEnto DuHkhamu Bonditivaa! Naa Korakento - DuHkhamu
Ponditivaa - Ento DuHkhamu Neeku - Ento Chintayu
Neeku - Ento Digulayyaa Naaku - Aa - Pontipilaatu -
Yoodulu Neeku Bettina - Sramalanu Dalapoyagaa
1)Vachchiri Yoodulu - Muchchata Laaduchu Nechchata Vaadanuchu
Ninnu-Matsaramuto Vaari - Yichchavachchinatlu Kotti Dooshinchinaaraa
|| Ento ||
2)Sundaramagu Deha - Manduna Debbalu - Granthulu Gattinavaa!
Neevu Pondina Baadha Naa-Dendamu Talanpa Naa-Nandamu Ledayenu
|| Ento ||
3)Kottukottumani - Titti Kel Datti Ni - Nnattittu Nettuchunu - Vaaru
Pettu Sramalu Tuda - Mattuna Korchiyu - Bettitivaa Praanamu
|| Ento ||
4)Nepamun Bettuchun Ditti - Yapahasinchuchu Yooda - Chapalulu
Gottinaaraa - Naa - Yaparaadhamulaku Naa - Padalanu Bondi
Nee - Krupa Naaku Joopinaavaa
|| Ento ||
5)Chakkani Naa Yesu ! Mikkili Baadha Nee - Kekkuva Galigenayya
Aahaa! Yokka Dushtudeete - Prakkanu Gruchchi - Tana Yakkasa
Deerchukonenaa
|| Ento ||
6)Annadammulaina Akka Sellendraina - Kanna Pitraadulainaa -
Nannu Ennadainaa Bremincha Lerairi - Naayanna Preminchinaavaa
|| Ento ||