తెలుగు నాప్రభువా నీప్రేమన్
పల్లవినా ప్రభువా - నీ ప్రేమన్ - నే ప్రణుతింతు - బ్రతుకు దినముల్
1)పరమునుండి నరరూపివిగా - ధర కరుదెంచితి వేసయ్యా
అరయగ నిరపరాధివిగా
|| నా ||
2)ముప్పదిమూడు వత్సరముల్ - గొప్ప వెలుగుగా నుంటివిగా
నను తెప్పరిల్లగా జేసితివి
|| నా ||
3)లోక పాపమును మోసితివి - ఒక శాపగ్రాహిగనైతివిగా
నాకు దొరికెనుగా దేవుని నీతి
|| నా ||
4)అరచేతులతో కొట్టిరిగా - కొరడాలతో బహు చీల్చిరిగా
నీ కరముల చీలలు నాటిరిగా
|| నా ||
5)ముఖముపై నుమియ నోర్చితివి - సుఖమెరుగక శ్రమపడితివిగా
శ్రమ నాఖరు వరకు సహించితివి
|| నా ||
6)రక్తము నెల్ల చిందించి - రిక్తుడవై మరణించితివి
నీ శక్తితో నను రక్షించితివి
|| నా ||
7)మృతులలో నుండి లేచితివి - నను నీతిమంతునిగ చేసితివి
నీ స్తుతులను, నే మరువగ జాల
|| నా ||
English Naaprabhuvaa Neepreman
ChorusNaa Prabhuvaa - Nee Preman - Ne Pranutintu - Bratuku Dinamul
1)Paramunundi Nararoopivigaa - Dhara Karudenchiti Vesayyaa
Arayaga Niraparaadhivigaa
|| Naa ||
2)Muppadimoodu Vatsaramul - Goppa Velugugaa Nuntivigaa
Nanu Tepparillagaa Jesitivi
|| Naa ||
3)Loka Paapamunu Mositivi - Oka Saapagraahiganaitivigaa
Naaku Dorikenugaa Devuni Neeti
|| Naa ||
4)Arachetulato Kottirigaa - Koradaalato Bahu Cheelchirigaa
Nee Karamula Cheelalu Naatirigaa
|| Naa ||
5)Mukhamupai Numiya Norchitivi - Sukhamerugaka Sramapaditivigaa
Srama Naakharu Varaku Sahinchitivi
|| Naa ||
6)Raktamu Nella Chindinchi - Riktudavai Maraninchitivi
Nee Saktito Nanu Rakshinchitivi
|| Naa ||
7)Mrtulalo Nundi Lechitivi - Nanu Neetimantuniga Chesitivi
Nee Stutulanu, Ne Maruvaga Jaala
|| Naa ||