తెలుగు ఎంత జాలి ఎంత కరుణ
పల్లవిఎంతజాలి ఎంత కరుణ - చూపితివి నా ప్రభూ
కల్వరి ఆ సిలువపైన - బలిగయైన నా ప్రభూ
1)దుష్టులే నాకిష్టులైరి - నీకు దూరమైతినీ - గర్విష్టులే
నా చుట్టములై నన్ను కృంగదీసిరి - అయినను నీ దయను
జూపి - ఆదరించిన నా ప్రభూ
|| ఎంత ||
2)పాపినై ఈ లోకమందు అంధునైతినో ప్రభూ - కాపరివి
నీవెయంచు కాననైతినో ప్రభూ - అయినను నీ కృపను
జూపి - కన్నులు తెరచిన నా ప్రభూ
|| ఎంత ||
3)ఎంచలేని పాపిని నన్ను - నీదు రక్తధారలన్ - కరుణతోడ
కడిగి కాచి దిద్దుచున్న జనక నిన్ - కొలిచి పాడి కీర్తించెదను
హల్లెలూయ నా ప్రభూ
|| ఎంత ||
English Emta Jaali Emta Karuna
ChorusEntajaali Enta Karuna - Choopitivi Naa Prabhoo
Kalvari Aa Siluvapaina - Baligayaina Naa Prabhoo
1)Dushtule Naakishtulairi - Neeku Dooramaitinee - Garvishtule
Naa Chuttamulai Nannu Krngadeesiri - Ayinanu Nee Dayanu
Joopi - Aadarinchina Naa Prabhoo
|| Enta ||
2)Paapinai Ee Lokamandu Andhunaitino Prabhoo - Kaaparivi
Neeveyanchu Kaananaitino Prabhoo - Ayinanu Nee Krupanu
Joopi - Kannulu Terachina Naa Prabhoo
|| Enta ||
3)Enchaleni Paapini Nannu - Needu Raktadhaaralan - Karunatoda
Kadigi Kaachi Didduchunna Janaka Nin - Kolichi Paadi Keertinchedanu
Hallelooya Naa Prabhoo
|| Enta ||