తెలుగు నా ప్రభువా ప్రేమయా
పల్లవినా ప్రభువా ప్రేమమయా నిన్ను అను నిత్యమును కీర్తింతున్
1)ఎండినట్టి భూమిలోన ఎంతో - చక్కని లేత మొక్కవలె
తండ్రి యెదుటనే పెరిగినావు
సిలువలో నాకై బలియైన యేసు
|| నా ప్రభు ||
2)లోబడనొల్లని నన్ను ప్రేమన్ - పిలిచి చేతులు జాపినావు
ఆ చేతులలో చీలల్ దించి - బాధించి - నట్టి భ్రష్టుండను నేను
|| నా ప్రభు ||
3)కరుణతో నిండిన నీ కనుల కన్నీరే నాకొరకని ఎరుగ
కరకు కర్కశ శిలల దారిన్ - కల్వరి - కంపిన కలుషాత్ముడను
|| నా ప్రభు ||
4)కాయమంతయు గాయముచేసి భయమున్ - వీడినిన్ను దూషించితిని
నోరు తెరువవు మారుబల్క - ఓర్చియు - నా కొరకు ప్రార్థించినావా
|| నా ప్రభు ||
5)శిక్షకునే లోనైయుండ ఆ! శిక్షను నీ వనుభవించి
రక్షించిన రక్షకుండా - అక్షయ - భాగ్యంబు నాకిచ్చినావా
|| నా ప్రభు ||
6)స్తుతి స్తోత్రముల సుమదళమ్ముల్ అయ్యా - పోసితి నీ పాద యుగళిన్
గళమెత్తి గానము చేతున్ - ఘనమైన- నా ప్రభువు నీవేయటంచు
|| నా ప్రభు ||
English Naa Prabhuvaa Premayaa
ChorusNaa Prabhuvaa Premamayaa Ninnu Anu Nityamunu Keertintun
1)Endinatti Bhoomilona Ento - Chakkani Leta Mokkavale
Tandri Yedutane Periginaavu
Siluvalo Naakai Baliyaina Yesu
|| Naa Prabhu ||
2)Lobadanollani Nannu Preman - Pilichi Chetulu Jaapinaavu
Aa Chetulalo Cheelal Dinchi - Baadhinchi - Natti Bhrashtundanu Nenu
|| Naa Prabhu ||
3)Karunato Nindina Nee Kanula Kanneere Naakorakani Eruga
Karaku Karkasa Silala Daarin - Kalvari - Kanpina Kalushaatmudanu
|| Naa Prabhu ||
4)Kaayamantayu Gaayamuchesi Bhayamun - Veedininnu Dooshinchitini
Noru Teruvavu Maarubalka - Orchiyu - Naa Koraku Praarthinchinaavaa
|| Naa Prabhu ||
5)Sikshakune Lonaiyunda Aa! Sikshanu Nee Vanubhavinchi
Rakshinchina Rakshakundaa - Akshaya - Bhaagyanbu Naakichchinaavaa
|| Naa Prabhu ||
6)Sthuthi Stotramula Sumadalammul Ayyaa - Positi Nee Paada Yugalin
Galametti Gaanamu Chetun - Ghanamaina- Naa Prabhuvu Neeveyatanchu
|| Naa Prabhu ||