Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 117 Old No: 7

ఆశతో యేసుని స్తుతియించు

Aashato Yesuni Stutiyinchu

Open in Word & Worship App
తెలుగు   ఆశతో యేసుని స్తుతియించు
పల్లవి
ఆశతో యేసుని స్తుతియించు - దోషములన్నీ భరించెనహా
1)
ఎన్నో శ్రమల నొందెను ప్రభువు - జననమొందినది మొదలుకొని
కరిగి కారిన కంటినీళ్ళ - రోదనములు దలపోయుచును
|| ఆశతో ||
2)
చింతనొంది విభ్రాంతిపడి - మునిగిపోయే బహుదుఃఖములో
ప్రాణము మరణము పొందునంతగ - నలిగి పోయే నీ ప్రభువు
|| ఆశతో ||
3)
మోయలేని మ్రానునొకటి - మోపిరేసు మేనుపైన
మోసికొనెను మన పాపములు - పాపమెరుగని యా ప్రభువు
|| ఆశతో ||
4)
విసరబడెను ప్రభు కల్వరిలో - ప్రేమ సత్యమను తిరుగటిలో
పిండివలెను పిసుకబడెను - కాల్చబడెను ప్రభు కల్వరిలో
|| ఆశతో ||
5)
మేకులను దిగగొట్టిరహా - మెత్తనైన కరపాదముల
ధారలుగారెను పావనరక్తము - ప్రాణము విడచెను నీ కొరకు
|| ఆశతో ||
English   Aashato Yesuni Stutiyinchu
Chorus
Aasato Yesuni Sthuthiyinchu - Doshamulannee Bharinchenahaa
1)
Enno Sramala Nondenu Prabhuvu - Jananamondinadi Modalukoni
Karigi Kaarina Kantineella - Rodanamulu Dalapoyuchunu
|| Aasato ||
2)
Chintanondi Vibhraantipadi - Munigipoye BahuduHkhamulo
Praanamu Maranamu Pondunantaga - Naligi Poye Nee Prabhuvu
|| Aasato ||
3)
Moyaleni Mraanunokati - Mopiresu Menupaina
Mosikonenu Mana Paapamulu - Paapamerugani Yaa Prabhuvu
|| Aasato ||
4)
Visarabadenu Prabhu Kalvarilo - Prema Satyamanu Tirugatilo
Pindivalenu Pisukabadenu - Kaalchabadenu Prabhu Kalvarilo
|| Aasato ||
5)
Mekulanu Digagottirahaa - Mettanaina Karapaadamula
Dhaaralugaarenu Paavanaraktamu - Praanamu Vidachenu Nee Koraku
|| Aasato ||
Present