తెలుగు క్రీస్త నిజమైన దేవుడు
పల్లవిక్రీస్తే నిజమైన దేవుడు - క్రీస్తే బలమైన దేవుడు
క్రీస్తే నీతి సూర్యుడు - క్రీస్తే నిత్యుడు తండ్రియున్
ఆరాధింతుము నేడారాధింతుము - ఆరాధింతుము
ఆత్మతో సత్యముతో
1)క్రీస్తే ఆది సంభూతుడు - క్రీస్తే ఆదియనంతుడు
క్రీస్తే అన్నిటి కాధారుడు - క్రీస్తే అన్నియు జేసెను
|| యేపాప ||
2)ఆదిలో వాక్యమై యుండెను - వాక్యమే దేవుడై యుండెను
వాక్యమే శరీర ధారియై - కృపా సంపూర్ణుడాయెను
|| యేపాప ||
3)యేసు రక్తము చిందెను - నా పాప ఋణము దీరెను
పరిశుద్ధుని జేసెను - పరము నందు జేర్చెను
|| యేపాప ||
4)క్రీస్తే మహా పరిశుద్ధుడు - క్రీస్తే దయా సమృద్ధుడు
క్రీస్తే రోగుల వైద్యుడు - క్రీస్తే ఆస్తుల మిత్రుడు
|| యేపాప ||
5)లోకమున్ జయించెను - పాపమున్ జయించెను
మరణమును జయించెను - మహిమ లోక మేగెను
|| యేపాప ||
6)క్రీస్తే నీతికి నిలయము - క్రీస్తే జ్ఞాన పూర్ణుడు
క్రీస్తే తీర్పు చేయును - ఇహపరంబు లేలును
|| యేపాప ||
7)క్రీస్తే రక్షణ మార్గము - క్రీస్తే జీవన మార్గము
యేసే కాంతి మార్గము - యేసే శాంతి మార్గము
|| యేపాప ||
8)యేసు క్రీస్తు రక్తము - ఎంత పాపివైనను
పరిశుద్ధుని జేసెను - పరము నందు జేర్చెను
|| యేపాప ||
English Kreesta Nijamaina Devudu
ChorusKreeste Nijamaina Devudu - Kreeste Balamaina Devudu
Kreeste Neeti Sooryudu - Kreeste Nityudu Tandriyun
Aaraadhintumu Nedaaraadhintumu - Aaraadhintumu
Aatmato Satyamuto
1)Kreeste Aadi Sanbhootudu - Kreeste Aadiyanantudu
Kreeste Anniti Kaadhaarudu - Kreeste Anniyu Jesenu
|| Yepaapa ||
2)Aadilo Vaakyamai Yundenu - Vaakyame Devudai Yundenu
Vaakyame Sareera Dhaariyai - Krupaa Sanpoornudaayenu
|| Yepaapa ||
3)Yesu Raktamu Chindenu - Naa Paapa Runamu Deerenu
Parisuddhuni Jesenu - Paramu Nandu Jerchenu
|| Yepaapa ||
4)Kreeste Mahaa Parisuddhudu - Kreeste Dayaa Samrddhudu
Kreeste Rogula Vaidyudu - Kreeste Aastula Mitrudu
|| Yepaapa ||
5)Lokamun Jayinchenu - Paapamun Jayinchenu
Maranamunu Jayinchenu - Mahima Loka Megenu
|| Yepaapa ||
6)Kreeste Neetiki Nilayamu - Kreeste Gnaana Poornudu
Kreeste Teerpu Cheyunu - Ihaparanbu Lelunu
|| Yepaapa ||
7)Kreeste Rakshana Maargamu - Kreeste Jeevana Maargamu
Yese Kaanti Maargamu - Yese Saanti Maargamu
|| Yepaapa ||
8)Yesu Kreestu Raktamu - Enta Paapivainanu
Parisuddhuni Jesenu - Paramu Nandu Jerchenu
|| Yepaapa ||