తెలుగు నీ సన్నిధిలో సాగిల పడి
పల్లవినీ సన్నిధిలో సాగిలపడి నిన్నారాధించెదము
నీ పద సన్నిధి నాకది పెన్నిధి - స్తోత్రము యేసు ప్రభో
1)మా కొరకై నీ తనువును రక్తము ధారవోసితివి మా పాపములను
విడిపించితివి పరమ దయాళుడవు
|| నీ ||
2)మా పాపములు అపరాధము చంపివేసితివి నీ కృప కనికర
వరములు ద్వారా మము బ్రతికించితివి
|| నీ ||
3)ఎన్నికలేని మన్నుకు నీ స్వరూపము నిచ్చితివి - నిను
సేవింపను యాజకులగు పరిశుద్ధుల జేసితివి
|| నీ ||
4)ఆ గ్రంధపు ముద్రలు విప్పుటకై మరి నీవే యోగ్యుడవు
నీ రక్తములో ప్రతి వంశములో మనుజుల గొంటివిగా
|| నీ ||
5)భూమ్యాకాశము ఉన్నత శిఖరము లన్నిటిలో ఘనుడా!
రాజుల రాజా! ప్రభువుల ప్రభువా! దేవతలకు దేవా!
|| నీ ||
6)నీ దాసులమై నీ సన్నిధిలో నిత్యానందముతో
నిను సేవించుచు హల్లెలూయా - పాటలు పాడెదము
|| నీ ||
English Nee Sannidhilo Saagila Padi
ChorusNee Sannidhilo Saagilapadi Ninnaaraadhinchedamu
Nee Pada Sannidhi Naakadi Pennidhi - Stotramu Yesu Prabho
1)Maa Korakai Nee Tanuvunu Raktamu Dhaaravositivi Maa Paapamulanu
Vidipinchitivi Parama Dayaaludavu
|| Nee ||
2)Maa Paapamulu Aparaadhamu Chanpivesitivi Nee Krupa Kanikara
Varamulu Dvaaraa Mamu Bratikinchitivi
|| Nee ||
3)Ennikaleni Mannuku Nee Svaroopamu Nichchitivi - Ninu
Sevinpanu Yaajakulagu Parisuddhula Jesitivi
|| Nee ||
4)Aa Grandhapu Mudralu Vipputakai Mari Neeve Yogyudavu
Nee Raktamulo Prati Vansamulo Manujula Gontivigaa
|| Nee ||
5)Bhoomyaakaasamu Unnata Sikharamu Lannitilo Ghanudaa!
Raajula Raajaa! Prabhuvula Prabhuvaa! Devatalaku Devaa!
|| Nee ||
6)Nee Daasulamai Nee Sannidhilo Nityaanandamuto
Ninu Sevinchuchu Hallelooyaa - Paatalu Paadedamu
|| Nee ||