తెలుగు ఏమని వర్ణింతును దేవా
పల్లవిఏమని వర్ణింతును దేవా - నిన్నేమని కీర్తింతును ప్రభువా
ఆకాశము మహా ఆకాశము - పట్టజాలనంత మహిమోన్నతుడా
1)కెరూపులు సెరాపులు - సర్వాధికారి యగు ప్రభువును
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు
గాన ప్రతిగానములు చేయుచుండగా
|| ఏమ ||
2)అడవి వృక్టములలో - జల్దరువృక్షమువలెను
పురుషులలో నా ప్రియుడు అతి శ్రేష్ఠుడు
ఆయన మాటలు నా జిహ్వకు మధురం
ఆనంద భరితనై కూర్చుంటిని
|| ఏమ ||
3)నీవు కలుగజేసిన ఈ సృష్టంత - నిన్నే కొనియాడుచున్నదో\... యేసయ్య
పగటికి పగలు రాత్రికి రాత్రి
నీ జ్ఞానమును వివరించుచున్నవి
|| ఏమ ||
4)నిన్ను స్తుతియింపను వేయి నాలుకలు - చాలనె చాలవు పరిశుద్ధుడా
ఎంత స్తుతియించిన నీ ఋణమును
తీర్చుకొనలేము కల్వరినాధా
|| ఏమ ||
5)సర్వలోక నివాసులారా - నా ప్రియుని గూర్చివింటిరా
దవళ వర్ణుడు రత్న వర్ణుడు
పదివేలమందిలో అతిసుందరుడు
|| ఏమ ||
English Emani Varnintuanu Devaa
Chorusemani Varnintunu Devaa - Ninnemani Keertintunu Prabhuvaa
Aakaasamu Mahaa Aakaasamu - Pattajaalananta Mahimonnatudaa
1)Keroopulu Seraapulu - Sarvaadhikaari Yagu Prabhuvunu
Parisuddhudu Parisuddhudu Parisuddhudanuchu
Gaana Pratigaanamulu Cheyuchundagaa
|| ema ||
2)Adavi Vruktamulalo - Jaldaruvrukshamuvalenu
Purushulalo Naa Priyudu Ati Sreshthudu
Aayana Maatalu Naa Jihvaku Madhuram
Aananda Bharitanai Koorchuntini
|| ema ||
3)Neevu Kalugajesina Ee Srushtanta - Ninne Koniyaaduchunnado... Yesayya
Pagatiki Pagalu Raatriki Raatri
Nee Gnaanamunu Vivarinchuchunnavi
|| ema ||
4)Ninnu Sthuthiyinpanu Veyi Naalukalu - Chaalane Chaalavu Parisuddhudaa
Enta Sthuthiyinchina Nee Runamunu
Teerchukonalemu Kalvarinaadhaa
|| ema ||
5)Sarvaloka Nivaasulaaraa - Naa Priyuni Goorchivintiraa
Davala Varnudu Ratna Varnudu
Padivelamandilo Atisundarudu
|| ema ||