Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 110 Old No: 514

మహిమ నీకే ప్రభూ

Mahima Neeke Prabhoo

Open in Word & Worship App
తెలుగు   మహిమ నీకే ప్రభూ
పల్లవి
మహిమ నీకే ప్రభూ - ఘనత నీకే ప్రభూ
స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభూ
ఆరాధన .... ఆరాధన ప్రియ యేసు ప్రభునకే - నా యేసు ప్రభునకే
1)
సమీపింపరాని తేజస్సునందు - వశియించు అమరుండవే
శ్రీమంతుడవే సర్వాధిపతివే - నీ రక్షణ నాకిచ్చితివే
|| ఆరా ||
2)
ఎంతో ప్రేమించి నాకై ఏతెంచి - ప్రాణము నర్పించితివే
విలువైన రక్తము చిందించి నన్ను - విమోచించితివే
|| ఆరా ||
3)
ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి - నను పిలచి వెలిగించితివే
నీ గుణాతిశయముల్‌ ధరనే ప్రచురింప - ఏర్పరచుకొంటివే
|| ఆరా ||
4)
రాజులైన యాజక సమూహముగా - ఏర్పరచబడిన వంశమై
పరిశుద్ధ జనమై నీ సొత్తయిన ప్రజగా నన్ను చేసితివే
|| ఆరా ||
English   Mahima Neeke Prabhoo
Chorus
Mahima Neeke Prabhoo - Ghanata Neeke Prabhoo
Sthuthi Mahima Ghanatayu Prabhaavamu Neeke Prabhoo
Aaraadhana .... Aaraadhana Priya Yesu Prabhunake - Naa Yesu Prabhunake
1)
Sameepinparaani Tejassunandu - Vasiyinchu Amarundave
Sreemantudave Sarvaadhipative - Nee Rakshana Naakichchitive
|| Aaraa ||
2)
Ento Preminchi Naakai etenchi - Praanamu Narpinchitive
Viluvaina Raktamu Chindinchi Nannu - Vimochinchitive
|| Aaraa ||
3)
Aascharyakaramaina Nee Veluguloniki - Nanu Pilachi Veliginchitive
Nee Gunaatisayamul Dharane Prachurinpa - erparachukontive
|| Aaraa ||
4)
Raajulaina Yaajaka Samoohamugaa - erparachabadina Vansamai
Parisudha Janamai Nee Sottayina Prajagaa Nannu Chesitive
|| Aaraa ||
Present