Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 11 Old No: 18

ప్రేమ నమ్మకము గల

Prema Nammakamu Gala

♪ సీయోను గీతములు♪ Songs of Zion
Open in Word & Worship App
తెలుగు   ప్రేమ నమ్మకము గల
పల్లవి
ప్రేమ నమ్మకముగల పరలోక తండ్రి తన కుమారుని పంపెను
రక్తము చిందించి మన పాపము కడుగ సిలువపై అర్పించెను
1)
త్యాగ సహిత ప్రేమజూపి - నెరవేర్చె తన నిబంధనను
మనలను తానే నిర్మించెగనుక మనలను ప్రేమించెను
|| ప్రేమ ||
2)
శాశ్వత ప్రేమ చూపించెను - సిలువపై ఋజువు గావించెను
తన రక్తముతో పాపులనెల్ల - శుద్ధుల చేసెనుగా
|| ప్రేమ ||
3)
తండ్రి వలెనే ప్రేమజూపి - నీచుల నెల్ల ప్రేమించెను
ఎవరు పాపము నొప్పుకొందురో - వారిని క్షమించును
|| ప్రేమ ||
4)
మా జీవితముల మార్చివేసి - తన సంతతిలో చేర్చెనుగా
తన మహా ప్రేమజూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను
|| ప్రేమ ||
5)
ఆత్మ శరీర ప్రాణములన్‌ అర్పించి ప్రభును స్తుతింతుము
హల్లెలూయా స్తుతి మహిమ ఘనత - ఎల్లప్పుడు ప్రభుకే
|| ప్రేమ ||
English   Prema Nammakamu Gala
Chorus
Prema Nammakamugala Paraloka Tandri Tana Kumaaruni Panpenu
Raktamu Chindinchi Mana Paapamu Kaduga Siluvapai Arpinchenu
1)
Tyaaga Sahita Premajoopi - Neraverche Tana Nibandhananu
Manalanu Taane Nirmincheganuka Manalanu Preminchenu
|| Prema ||
2)
Saasvata Prema Choopinchenu - Siluvapai Rjuvu Gaavinchenu
Tana Raktamuto Paapulanella - Suddhula Chesenugaa
|| Prema ||
3)
Tandri Valene Premajoopi - Neechula Nella Preminchenu
Evaru Paapamu Noppukonduro - Vaarini Kshaminchunu
|| Prema ||
4)
Maa Jeevitamula Maarchivesi - Tana Santatilo Cherchenugaa
Tana Mahaa Premajoopinchi Maaku Svaasthyamu Dayachesenu
|| Prema ||
5)
Aatma Sareera Praanamulan Arpinchi Prabhunu Sthuthintumu
Hallelooyaa Sthuthi Mahima Ghanata - Ellappudu Prabhuke
|| Prema ||
Present