Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 108 Old No: 465

నా ప్రాణ దాత యేసువా

Naa Praana Daata Yesuvaa

Open in Word & Worship App
తెలుగు   నా ప్రాణ దాత యేసువా
పల్లవి
నా ప్రాణదాత యేసువా - నమస్కరింతును
నీ ప్రేమ సౌఖ్య శాంతము - స్మరింతు నెప్పుడున్‌
నీ సర్వశక్తి సంపదల్‌ - చాటింతు నెల్లడన్‌ నమస్కరింతును
నమస్కరింతును - ఓ ప్రేమ సత్యరూపుడ - నమస్కరింతును
1)
దేదీప్య మానరూపుడ - యీ దీన పాపికై
హీనుండవోలె హేళనొంది తరుమబడితివే
ఆ భారభరితమైన సిలువ - మోసియుంటివే
|| నమ ||
2)
ఓ గొఱ్ఱెపిల్ల యేసువా - యీ ఘోరపాపికై
నీ రక్తమంత కార్చనై - వధింపబడితివే
నా ఘోరమరణమున్‌ - తప్పింప మరణమైతివే
|| నమ ||
3)
ఓ మృత్యు విజయుడేసువా - మహోన్నతుండవే
నా నిత్యజీవమైన దేవ - మహిమరాజువే
ఓ నీతిన్యాయపాలకుండ - రాజులరాజా
|| నమ ||
4)
సర్వాధికారివైన దేవ శాశ్వితుండవే
సంపూర్ణ శాంతి సౌఖ్యరాజ్య - పాలకుండవే
సంపూర్ణ హృదయమిచ్చి నీకు - సాగిలపడుదున్‌
|| నమ ||
English   Naa Praana Daata Yesuvaa
Chorus
Naa Praanadaata Yesuvaa - Namaskarintunu
Nee Prema Saukhya Saantamu - Smarintu Neppudun
Nee Sarvasakti Sanpadal - Chaatintu Nelladan Namaskarintunu
Namaskarintunu - O Prema Satyaroopuda - Namaskarintunu
1)
Dedeepya Maanaroopuda - Yee Deena Paapikai
Heenundavole Helanondi Tarumabaditive
Aa Bhaarabharitamaina Siluva - Mosiyuntive
|| Nama ||
2)
O Gorrepilla Yesuvaa - Yee Ghorapaapikai
Nee Raktamanta Kaarchanai - Vadhinpabaditive
Naa Ghoramaranamun - Tappinpa Maranamaitive
|| Nama ||
3)
O Mrtyu Vijayudesuvaa - Mahonnatundave
Naa Nityajeevamaina Deva - Mahimaraajuve
O Neetinyaayapaalakunda - Raajularaajaa
|| Nama ||
4)
Sarvaadhikaarivaina Deva Saasvitundave
Sanpoorna Saanti Saukhyaraajya - Paalakundave
Sanpoorna Hrudayamichchi Neeku - Saagilapadudun
|| Nama ||
Present