తెలుగు ఆది సంభూతుని
పల్లవిఆది సంభూతుని ఆధారభూతుని అల్ఫ ఓమెగను
ఆనందమొందుచు ఆత్మ సత్యముతో ఆరాధింతము
1)సర్వాధికారి సర్వోపకారి సర్వోన్నతుడాయనే
సర్వజ్ఞానియును సర్వవ్యాపియును సర్వశక్తియాయనే
సర్వనిర్మాణకుడు సర్వనిర్వాహకుడు సర్వసంపన్నుడు
సర్వనిరీక్షణ సర్వములో సర్వంబు సర్వస్తోత్రార్హుడు
|| ఆది ||
2)ఆయనే నిన్న ఆయనే నేడు ఆయనే నిరతము
ఆయన మారడు ఆయనే శూరుడు ఆయనే సూర్యుడు
ఆయన అధికారి ఆయనే ఆది ఆయనే అంతము
ఆయనకే మహిమ ఆయనకే ఘనత ఆయనకే స్తోత్రము
|| ఆది ||
3)అతి కాంక్షణీయుడు అతికీర్తనీయుడు అందరిలో సుందరుడు
అతడే మన అర్పణయై, అవమానము అపహాస్యము అనుభవించెను
అన్యాయపు తీర్పు అతడు పొందె అందరి అపరాధముకై
ఆత్మనప్పగించి ఆదివారము లేచి ఆరోహణమాయెను
|| ఆది ||
4)నిర్దోషి ఆయనే నిష్కల్మషుడాయనే నీతియు ఆయనే
నిర్దేవులమైన నిర్హేతుకముగ నీతిమంతుల జేసె నిత్య జీవంబు
నిత్య విమోచనము నిత్య రక్షణ నిడె నిత్య రాజ్యంబు
నిత్య మహిమయు నిశ్చలము నిశ్చయం
|| ఆది ||
English Aadi Sambhootuni
ChorusAadi Sanbhootuni Aadhaarabhootuni Alpha Omeganu
Aanandamonduchu Aatma Satyamuto Aaraadhintamu
1)Sarvaadhikaari Sarvopakaari Sarvonnatudaayane
Sarvagnaaniyunu Sarvavyaapiyunu Sarvasaktiyaayane
Sarvanirmaanakudu Sarvanirvaahakudu Sarvasanpannudu
Sarvanireekshana Sarvamulo Sarvanbu Sarvastotraarhudu
|| Aadi ||
2)Aayane Ninna Aayane Nedu Aayane Niratamu
Aayana Maaradu Aayane Soorudu Aayane Sooryudu
Aayana Adhikaari Aayane Aadi Aayane Antamu
Aayanake Mahima Aayanake Ghanata Aayanake Stotramu
|| Aadi ||
3)Ati Kaankshaneeyudu Atikeertaneeyudu Andarilo Sundarudu
Atade Mana Arpanayai, Avamaanamu Apahaasyamu Anubhavinchenu
Anyaayapu Teerpu Atadu Ponde Andari Aparaadhamukai
Aatmanappaginchi Aadivaaramu Lechi Aarohanamaayenu
|| Aadi ||
4)Nirdoshi Aayane Nishkalmashudaayane Neetiyu Aayane
Nirdevulamaina Nirhetukamuga Neetimantula Jese Nitya Jeevanbu
Nitya Vimochanamu Nitya Rakshana Nide Nitya Raajyanbu
Nitya Mahimayu Nischalamu Nischayan
|| Aadi ||