Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 102 Old No: 103

ఆరాధించెద నిను

Aaradhinceda Ninu

Open in Word & Worship App
తెలుగు   ఆరాధించెద నిను
పల్లవి
ఆరాధించెద నిను మదిపాగడెద నిరతమునిను స్తుతియించెదను
మార్గము నీవె - సత్యము నీవే - జీవము నీవే నా ప్రభువా
1)
విస్తారంబగు వ్యాపకములతో - విడిచితి నీ సహవాసమును
సరిదిద్దితివి నా జీవితము నిను సేవింపగ నేర్పిన ప్రభువా
|| ఆ ||
2)
నా జీవితమున నీ మాటలను - వినుటయే చాలని యెగిగితిని
నా కన్నీటితో నీ పాదములను కడుగుట నేర్పిన ఓ నా ప్రభువా
|| ఆ ||
3)
నీ రక్తముతో నను కడిగితివి - పరిశుద్ధునిగా జేసితివి నీ రక్షణకై
స్తోత్రము చేయుచు నిత్యము నిన్ను కొనియాడెదను
|| ఆ ||
4)
ప్రియముగ దాచిన అత్తరు భరణి - పగులగొట్టి నిను పూజింతు
నీ ప్రేమను నేనెన్నెగతరమా నా జీవితమున చాలిన ప్రభువా
|| ఆ ||
5)
పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు - నీ సన్నిధిలో నిలిచినను
లెక్కింపగజాలని జనమందున నను గుర్తింతువు నా ప్రియ ప్రభువా
|| ఆ ||
English   Aaradhinceda Ninu
Chorus
Aaraadhincheda Ninu Madipaagadeda Niratamuninu Sthuthiyinchedanu
Maargamu Neeve - Satyamu Neeve - Jeevamu Neeve Naa Prabhuvaa
1)
Vistaaranbagu Vyaapakamulato - Vidichiti Nee Sahavaasamunu
Sarididditivi Naa Jeevitamu Ninu Sevinpaga Nerpina Prabhuvaa
|| Aa ||
2)
Naa Jeevitamuna Nee Maatalanu - Vinutaye Chaalani Yegigitini
Naa Kanneetito Nee Paadamulanu Kaduguta Nerpina O Naa Prabhuvaa
|| Aa ||
3)
Nee Raktamuto Nanu Kadigitivi - Parisuddhunigaa Jesitivi Nee Rakshanakai
Stotramu Cheyuchu Nityamu Ninnu Koniyaadedanu
|| Aa ||
4)
Priyamuga Daachina Attaru Bharani - Pagulagotti Ninu Poojintu
Nee Premanu Nenennegataramaa Naa Jeevitamuna Chaalina Prabhuvaa
|| Aa ||
5)
Peddalu Parisuddhulu Ghanadootalu - Nee Sannidhilo Nilichinanu
Lekkinpagajaalani Janamanduna Nanu Gurtintuvu Naa Priya Prabhuvaa
|| Aa ||
Present