తెలుగు ఆరాధింతు ఆత్మరూప
పల్లవిఆరాధింతు ఆత్మరూప - ఆత్మతో సత్యముతో
నేను నిన్ను స్తోత్రించుటకు - నీవే కారణభూతుడవు
1)ఊరి వెలుపలగా నేనుంటి - దారిప్రక్కను పడియుంటి
ఘోరవ్యాధితో - బాధపడగా - చేరి నను కరుణించితివి
|| ఆరా ||
2)నాదు పెదవులు అపవిత్రములు - నాదు పాదముల పవిత్రం
కొంత కాదు కొన్ని కాదు - మొత్తమంతా దోషములే
|| ఆరా ||
3)ఇష్టపడితివి ననురక్షింప - కష్టపడితివి కలువరిలో
శుద్ధికలుగుట చూడగానే - బుద్ధికలిగెను స్తుతియింప
|| ఆరా ||
4)దంచి విసరి నలిపి కాల్చ - రొట్టెయాయెను గోధుమలు
అట్టి నీదు దేహమునకు - రొట్టె నిడితివి సూచనగా
|| ఆరా ||
5)నాదు చేదును త్రాగినయేసూ - క్రోధపాత్రను త్రాగితివా !
రుధిరచిహ్నం పాత్రలోనిది - మధురమగు ప్రేమకు స్తోత్రం
|| ఆరా ||
English Aaradhintu Aatmaroopa
ChorusAaraadhintu Aatmaroopa - Aatmato Satyamuto
Nenu Ninnu Stotrinchutaku - Neeve Kaaranabhootudavu
1)Oori Velupalagaa Nenunti - Daariprakkanu Padiyunti
Ghoravyaadhito - Baadhapadagaa - Cheri Nanu Karuninchitivi
|| Aaraa ||
2)Naadu Pedavulu Apavitramulu - Naadu Paadamula Pavitram
Konta Kaadu Konni Kaadu - Mottamantaa Doshamule
|| Aaraa ||
3)Ishtapaditivi Nanurakshinpa - Kashtapaditivi Kaluvarilo
Suddhikaluguta Choodagaane - Buddhikaligenu Sthuthiyinpa
|| Aaraa ||
4)Danchi Visari Nalipi Kaalcha - Rotteyaayenu Godhumalu
Atti Needu Dehamunaku - Rotte Niditivi Soochanagaa
|| Aaraa ||
5)Naadu Chedunu Traaginayesoo - Krodhapaatranu Traagitivaa !
Rudhirachihnan Paatralonidi - Madhuramagu Premaku Stotran
|| Aaraa ||