Word & Worshipవాక్యం & క్రైస్తవ సునాద కీర్తనలు
⌂ Home ♫ Open App
Song No: 10 Old No: 17

కృప కనికరముల మా దేవా

Krpa Kanikaramula Maa Devaa

♪ సీయోను గీతములు♪ Songs of Zion
Open in Word & Worship App
తెలుగు   కృప కనికరముల మా దేవా
పల్లవి
కృప కనికరముల - మా దేవా - కృతజ్ఞతనర్పింతు
1)
యోహోవా చేసిన ఉపకారములకై ఆయన కేమి చెల్లింతును?
యోహోవా నామమున - ప్రార్థనజేసెదను రక్షణ పాత్రచేబూని
|| కృప ||
2)
తల్లిగర్భమున - రూపింపబడక -మునుపే నన్ను ఎరిగితివి
తల్లిగర్భము నుండి - బయలుపడక ముందే ప్రతిష్టించితివి
|| కృప ||
3)
పూర్ణమనస్సుతో - నన్ను వెదకిన నన్ను కనుగొందురంటివి
కరుణతో నీవే - నన్ను వెదకి - రక్షించితివి ప్రభువా
|| కృప ||
4)
దూషకుడను - హింసకుడను - హానికరుడనై యుంటిని
దాసునిగా నన్ను - జేసికొంటివి దోషముల బాపి
|| కృప ||
5)
ఇది నీ కొరకై - విరువబడిన నా శరీరమని యంటివి
ఇది నీ పాప - క్షమకొరకై - చిందిన రక్తమంటివి
|| కృప ||
6)
నీదు కృపతో నాదు యేసు - నను నీవు రక్షించితివి
కాదు నాదు క్రియలవలన - ఇది దేవుని వరమే
|| కృప ||
7)
చెప్పనశక్యము - మహిమాయుక్తము - నీవొసంగిన సంతోషము
తప్పకుండ హల్లెలూయ - పాట పాడెదన్‌
|| కృప ||
English   Krpa Kanikaramula Maa Devaa
Chorus
Krupa Kanikaramula - Maa Devaa - Krutagnaatanarpintu
1)
Yohovaa Chesina Upakaaramulakai Aayana Kemi Chellintunu?
Yohovaa Naamamuna - Praarthanajesedanu Rakshana Paatrachebooni
|| Krupa ||
2)
Talligarbhamuna - Roopinpabadaka -Munupe Nannu Erigitivi
Talligarbhamu Nundi - Bayalupadaka Munde Pratishtinchitivi
|| Krupa ||
3)
Poornamanassuto - Nannu Vedakina Nannu Kanugondurantivi
Karunato Neeve - Nannu Vedaki - Rakshinchitivi Prabhuvaa
|| Krupa ||
4)
Dooshakudanu - Hinsakudanu - Haanikarudanai Yuntini
Daasunigaa Nannu - Jesikontivi Doshamula Baapi
|| Krupa ||
5)
Idi Nee Korakai - Viruvabadina Naa Sareeramani Yantivi
Idi Nee Paapa - Kshamakorakai - Chindina Raktamantivi
|| Krupa ||
6)
Needu Krupato Naadu Yesu - Nanu Neevu Rakshinchitivi
Kaadu Naadu Kriyalavalana - Idi Devuni Varame
|| Krupa ||
7)
Cheppanasakyamu - Mahimaayuktamu - Neevosangina Santoshamu
Tappakunda Hallelooya - Paata Paadedan
|| Krupa ||
Present